Shyam Singha Roy: నాని కోసం ఆస్కార్ విన్నర్..!

| Edited By:

Feb 29, 2020 | 3:37 PM

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే చిత్రంలో నటిస్తోన్న నాని.. ఆ తరువాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

Shyam Singha Roy: నాని కోసం ఆస్కార్ విన్నర్..!
Follow us on

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే చిత్రంలో నటిస్తోన్న నాని.. ఆ తరువాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు దర్శకుడు.

అందులో భాగంగా సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాతలు ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం. మరి ఈ సినిమాకు రెహమాన్ ఒప్పుకుంటారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా కొమరం పులి తరువాత ఇంతవరకు మరో తెలుగు చిత్రానికి పనిచేయలేదు రెహమాన్. చిరు నటించిన సైరాకు మొదట రెహమాన్ పేరే వినిపించినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం అవుతుంది. కాగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన ‘వి’ చిత్రం ఉగాది కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: టాక్సీవాలా దర్శకుడితో నాని.. టైటిల్, ప్రీలుక్ టీజర్ విడుదల..!