‘పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ చేయొద్దు.. వృత్తిపరమైన విషయాలు మాట్లాడుదాం’ రూమర్స్‌పై స్పందించిన హాట్ బ్యూటీ..

Shrutihasan:కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు,

పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ చేయొద్దు.. వృత్తిపరమైన విషయాలు మాట్లాడుదాం రూమర్స్‌పై స్పందించిన హాట్ బ్యూటీ..

Updated on: Feb 03, 2021 | 3:14 PM

Shrutihasan: కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపును సాధించింది. హీరోయిన్‌ గానే కాకుండా సినిమాకు సంబంధించి పలు డిపార్డ్‌మెంట్లలో ప్రావీణ్యం సంపాదించింది. ఇటీవల రవితేజ నటించిన క్రాక్ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరి మన్ననలను పొందింది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది.

ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయని గుర్తుచేసింది. ప్రస్తుతం తాను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నానని కాబట్టి అందరూ కూడా దాని గురించే మాట్లాడితే బాగుంటుందని ఘాటుగా స్పందించింది. అందరు దాని గురించి మాట్లాడితే ఏ సమస్యలు ఉండవంటు కితాబిచ్చింది. అలాగే శ్రుతి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్‌ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తనపాత్ర గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలతో పోలిస్తే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా విభిన్నంగా ఉంటుందని ప్రకటించింది. అంతేకాకుండా మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Allu Arjun PUSHPA Movie : బన్నీ-సుకుమార్ సినిమాకు లీకుల బెడద.. ‘పుష్ప’ నుంచి సాంగ్, ఫైట్ సీన్‏లను బయటపెట్టిన కేటుగాళ్లు..