Shruti Haasan : ఈ ఏడాదిలోనే పెళ్లి.. ఫ్యాన్స్‌తో లైవ్ చిట్ చాట్‌లో క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్ ..

అయితే లవ్‌ బ్రేకప్‌ కావడంతో మళ్లీ సినిమాలు, మ్యూజిక్‌ అంటూ తనకు నచ్చిన బాటలోనే పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ చెన్నై ..

Shruti Haasan : ఈ ఏడాదిలోనే పెళ్లి.. ఫ్యాన్స్‌తో లైవ్ చిట్ చాట్‌లో క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్ ..

Updated on: Jan 25, 2021 | 12:24 PM

ఈ మధ్య సోషల్ మీడియా టచ్‌లో ఉంటున్న శ్రుతిహాసన్… తాజాగా ఫాన్స్‌తో లైవ్ చిట్ చాట్ చేసింది. అభిమానులతో మనసు విప్పి మాట్లాడింది. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని ఈ ఏడాదిలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని ప్రశ్నిస్తే అదంతా ఫేక్‌ న్యూస్‌ అని కొట్టి పారేసింది.

ఓ అభిమాని అయితే మీ మాజీ ప్రియుడు మైకేల్‌ గుర్తుకు వస్తే అసహ్యం వేస్తుందా? అని ప్రశ్నించాడు. శ్రుతిహాసన్‌ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సూటిగా సమాధానం ఇచ్చింది. మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే, నేను ఎవరినీ ఆసహ్యించుకోను. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోలోపల కాస్త బాధపడతాను అని చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది శ్రుతిహాసన్‌.

దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్స్‌లో శ్రుతిహాసన్‌.. ప్రేమ కారణంగా సినిమాల నుండి బ్రేక్‌ తీసుకుంది. అయితే లవ్‌ బ్రేకప్‌ కావడంతో మళ్లీ సినిమాలు, మ్యూజిక్‌ అంటూ తనకు నచ్చిన బాటలోనే పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ చెన్నై సొగసరి సోషల్‌ మీడియాలో అభిమానులతో రీసెంట్ గా చిట్‌ చాట్‌ చేసింది.