Shriya Saran: బాలీవుడ్ స్టార్స్ పై శ్రియ షాకింగ్ కామెంట్స్.. అప్పుడే అలాంటివారికి ఇండస్ట్రీలో ఛాన్సులు

ఇండస్ట్రీలో రాణించాలంటే వారసత్వంగా గట్టి పునాది అయినా ఉండాలి, లేదంటే ఆరంగంలో సెటిల్ అయిన వాళ్లు ఛాన్సులు అయినా ఇవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ సాధ్యం. కానీ ఈవేమి లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కష్టమనే అంటారు క్రిటిక్స్. సరిగ్గా ఇదే అంశంపై హీరోయిన్ శ్రియ శరణ్ రియాక్ట్ అయ్యారు. నెపోటిజం విసయమై మాట్లాడారు.

Shriya Saran: బాలీవుడ్ స్టార్స్ పై శ్రియ షాకింగ్ కామెంట్స్.. అప్పుడే అలాంటివారికి ఇండస్ట్రీలో ఛాన్సులు
Shriya Saran

Updated on: Mar 06, 2024 | 5:01 PM

ఇండస్ట్రీలో రాణించాలంటే వారసత్వంగా గట్టి పునాది అయినా ఉండాలి, లేదంటే ఆరంగంలో సెటిల్ అయిన వాళ్లు ఛాన్సులు అయినా ఇవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ సాధ్యం. కానీ ఈవేమి లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కష్టమనే అంటారు క్రిటిక్స్. సరిగ్గా ఇదే అంశంపై హీరోయిన్ శ్రియ శరణ్ రియాక్ట్ అయ్యారు. నెపోటిజం విసయమై మాట్లాడారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా పరిశ్రమలోకి వచ్చినప్పుడు బయటి వ్యక్తి అని ఆమె కామెంట్ చేశారు.

ఇన్సైడర్-ఔట్సైడర్ డిబేట్ గురించి శ్రియ మాట్లాడుతూ, “ఒకప్పుడు అందరూ బయటివారు – షారుఖ్ ఖాన్ కూడా పరిశ్రమలోకి వచ్చినప్పుడు బయటివారు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారుతున్నాయని, కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే రాణించగలుగుతారని ప్రస్తుత పరిస్ధితులపై రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా, నిజంగా మారాల్సిన విషయం ఏమిటంటే.. కథకు సరిపడే హీరో హీరోయిన్స్ ముందుగానే లుక్ టెస్ట్ చేసి సరిపోరా? లేదా అడిషన్ చేస్తే ఈ సమస్య ఉండదని బహిరంగంగా చెప్పారు. అప్పుడే కొత్తవారికి అవకాశాలు వస్తాయని శ్రియా అన్నారు. ఇక ఇమ్రాన్ హష్మి, మహిమా మక్వానా, మౌనీ రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, విశాల్ వశిష్ట, నీరజ్ మాధవ్, విజయ్ రాజ్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓ చిత్రంలో లో శ్రియా కూడా నటిస్తోంది.

‘‘పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక హీరోయిన్లు ఇంట్లో కూర్చునే రోజులు పోయాయి. నేటి బిటౌన్ లేడీస్ డబుల్ పవర్ తో ప్రపంచంతో పోరాడేందుకు రెడీ అవుతున్నారు.అలాంటి వారిలో ఒకరు నటి శ్రియ శరణ్. శ్రియ 2021 లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఫిట్ గా ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో బి టౌన్ లోని తల్లి అయిన వారికి తిరిగి సినిమా రంగంలో పనిచేయడానికి ఎక్కువ ఉదాహరణగా నిలిచిన బాలీవుడ్ నటి కాజోల్ ను ప్రశంసించింది. ఈ జాబితాలో తరువాత కరీనా కపూర్ ఖాన్, అలియా భట్, ఇతర హీరోయిన్లు ఉన్నారు.