Srikaram Movie Update: శివరాత్రికి రానున్న శర్వానంద్ ‘శ్రీకారం’.. మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం..

|

Jan 23, 2021 | 6:36 PM

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కిశోర్ బి. దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శర్వానంద్‏కు గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్

Srikaram Movie Update: శివరాత్రికి రానున్న శర్వానంద్ శ్రీకారం.. మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం..
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కిశోర్ బి. దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శర్వానంద్‏కు గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘భలేగుంది బాలా, సందల్లె సందల్లె సంక్రాంతి సందల్లె’ అనే పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

శివరాత్రి కానుకగా మార్చి 11న ‘శ్రీకారం’ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇదే క్రమంలోనే రిలీజ్ డేట్ పోస్టర్‏ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ రైతుగా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా.. జే యువరాజ్ సినిమాటోగ్రఫి అందించారు.

Also Read:

ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. డేట్స్‏ రివీల్ చేసిన డైరెక్టర్.. అభిమానులకే ఇక పండగే..

అరుదైన ఘనత సాధించిన సమంత.. ఆ క్రెడిట్ దక్కించున్న తొలి భారతీయ నటిగా అక్కినేని వారి కోడలు..