Lakshya Movie: నాగచైతన్య వదిలిన “లక్ష్య” మూవీ రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న పాట

|

Dec 05, 2021 | 4:22 PM

యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.

Lakshya Movie: నాగచైతన్య వదిలిన లక్ష్య మూవీ రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న పాట
Lakshya
Follow us on

Lakshya movie: యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న కథా నేపథ్యంతో సంతోష్ జాగర్లపూడి ప్రయోగం చేసేందుకు రాబోతోన్నారు.

తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన రిలికల్ సాంగ్ ను విడుదల చేశారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సయ సయ’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగ శౌర్య, కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక నేడు (డిసెంబర్ 5)న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కుర్ర హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్ ధీమా గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతంచేసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..