అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు.. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఉగాది సందర్భంగా ఈ మూవీ ప్రీమియర్ ప్రదర్శితం కాగా.. 23.4 టీర్పీతో ‘బాహుబలి 2’ను క్రాస్ చేసి సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల గ్యాప్‌తో ఈ మూవీ ఇటీవల రెండోసారి బుల్లితెరపై ప్రదర్శితమైంది. ఇక రెండో సారి సైతం 17.4 టీర్పీతో రేటింగ్‌ను సాధించడం విశేషం. ఆన్‌లైన్‌లోనూ ఈ సినిమా ఉన్నప్పటికీ, బుల్లితెరపైన ప్రదర్శితమైన ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం గమనర్హం.
కాగా ఈ మూవీలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించగా.. రష్మిక ఆయన సరసన నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
#SarileruNeekevvaru gets 17.4 TRP's in its second telecast!!?#MassMBMania ?
Super ⭐ @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop pic.twitter.com/hgq7OeqFrb
— AK Entertainments (@AKentsOfficial) July 9, 2020