నా తండ్రికి డ్రగ్స్‏కు అలవాటు ఉంది. కానీ.. సంజయ్ దత్‏పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు..

|

Dec 12, 2020 | 11:52 AM

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‏పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు చేశారు. సంజు డ్రగ్స్‏కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‏కు ఎదగడం వరకు

నా తండ్రికి డ్రగ్స్‏కు అలవాటు ఉంది. కానీ.. సంజయ్ దత్‏పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు..
Follow us on

Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‏పై ఆయన కుమార్తె సంచనల వ్యాఖ్యలు చేశారు. సంజు డ్రగ్స్‏కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‏కు ఎదగడం వరకు అన్ని విషయాలు తెలిసినవే. అంతేకాకుండా ఈ బాలీవుడ్ హీరో బయోపిక్‏ను కూడా “సంజు” పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడినా.. దానిని విజయవంతంగా జయించారు. కాగా సంజత్ దత్ డ్రగ్స్ అలవాటు గురించి తాజా ఆయన కుమర్తె త్రిషాలా దత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “గతంలో నా తండ్రి డ్రగ్స్‏కు అలవాటు పడినా.. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డారు. డ్రగ్స్ తీసుకోకపోయినప్పటికీ ప్రతిరోజూ పోరాడాల్సిన సమస్య వచ్చింది. తనకు తానుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒప్పుకోవడమే కాకుండా, దాని నుంచి బయటపడటానికి సహాయం కోరారు. నా తండ్రి విషయంలో నేనేమి సిగ్గు పడడం లేదు” అని త్రిషాలా అన్నారు.