Samuthirakani : ‘ఆర్ఆర్ఆర్’ లో అవకాశం అలా వచ్చింది… ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని

'అలవైకుంఠపురంలో' సినిమాలో విలన్ గా నటించిన సముద్రఖని మంచి పేరును తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇటీవల చాలా సినిమాలో ఆయన కనిపిస్తున్నారు.

Samuthirakani : ఆర్ఆర్ఆర్ లో అవకాశం అలా వచ్చింది... ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని

Updated on: Jan 14, 2021 | 9:20 PM

Samuthirakani : ‘అలవైకుంఠపురంలో’ సినిమాలో విలన్ గా నటించిన సముద్రఖని మంచి పేరును తెచ్చుకున్నారు. ఆతర్వాత ఇటీవల చాలా సినిమాలో ఆయన కనిపిస్తున్నారు. ఇటీవల ‘క్రాక్’ సినిమాలో విలన్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు సముద్రఖని. కథ రచయిత నటుడిగా సముద్రఖని రాణిస్తున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లోను కీలక పాత్రలో కనిపించనున్నాడు సముద్రఖని.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు.సముద్రఖని మాలాడుతూ.. రాజమౌళి నాకు మంచి స్నేహితుడు. గత 11 సంవత్సరాలుగా నాకు రాజమౌళి పరిచయం. నాడోడిగల్ (తెలుగులో శంబో శివ శంబో) విడుదలైన తర్వాత రాజమౌళి నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో సినిమాలో నాకు ఓ క్యారెక్టర్ లభించింది’ సముద్రఖని చెప్పుకొచ్చారు.