నిరాశను అస్సలు భరించలేను.. అందుకే..!

| Edited By:

Feb 12, 2020 | 7:57 PM

నిరాశ చెందడం తనకు అస్సలు ఇష్టం ఉండదని అక్కినేని కోడలు సమంత అంటోంది. ఇటీవల జాను చిత్రంతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మొదటిసారిగా శర్వానంద్ సరసన నటించింది సమంత. కాగా ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది జాను. ఇదిలా ఉంటే ఈ మూవీ పోస్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. […]

నిరాశను అస్సలు భరించలేను.. అందుకే..!
Follow us on

నిరాశ చెందడం తనకు అస్సలు ఇష్టం ఉండదని అక్కినేని కోడలు సమంత అంటోంది. ఇటీవల జాను చిత్రంతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ’96’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మొదటిసారిగా శర్వానంద్ సరసన నటించింది సమంత. కాగా ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది జాను.

ఇదిలా ఉంటే ఈ మూవీ పోస్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది సమంత. ఈ మూవీ తన వద్దకు వచ్చినప్పుడు, ఛాలెంజ్‌గా భావించి ఒప్పుకున్నానని పేర్కొంది. ఇక నిరాశ చెందడం అస్సలు ఇష్టముండదని, దాన్ని భరించలేనని.. అందుకే తాను నటించిన అన్ని చిత్రాలు హిట్టు అవ్వాలని కోరుకుంటానని సమంత చెప్పుకొచ్చింది. కాగా సమంత తదుపరి చిత్రం ఇంకా ఫైనల్ అవ్వలేదు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో ఆమె నెగిటివ్ పాత్రలో నటించగా.. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది.