యాభై ఐదో వసంతంలోకి అడుగెడుతున్న కండల వీరుడు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్న సల్లూ భాయ్..

|

Dec 26, 2020 | 10:07 PM

సల్మాన్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎప్పటి లా తనను కలవడానికి అభిమానులు తన ఇంటికి

యాభై ఐదో వసంతంలోకి అడుగెడుతున్న కండల వీరుడు.. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్న సల్లూ భాయ్..
Follow us on

సల్మాన్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆయన తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎప్పటి లా తనను కలవడానికి అభిమానులు తన ఇంటికి రావొద్దని సూచిస్తున్నాడు. ఆదివారంతో సల్మాన్ 55 వ వసంతంలోకి అడుగుబెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు ఈ విధంగా చెబుతున్నాడు.

ఈ ఏడాది తన ఇంటి గెలాక్సీ ముందుకు రావద్దని విజ్ఞప్తి చేశాడు సల్మాన్‌ఖాన్‌. ఈ మేరకు ఇంటి ముందు బ్యానర్‌ ఏర్పాటు చేశాడు. ఈ ఏడాది పరిణామాలు చాలా భిన్నంగా ఉన్నాయని గుర్తు చేశాడు. తాను ఈ ఏడాది జన్మ దినోత్సవానికి ఇంటి వద్ద ఉండటం లేదని తెలిపాడు. అంతేకాదు మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడానికి నిబంధనలు అమలవుతున్నందున.. అభిమానులంతా సేఫ్‌గా వారి ఇంటి వద్దే ఉండి పోవాలని అభ్యర్థించాడు. ఇన్ని సంవత్సరాలుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ఎంతో రుణపడి ఉంటానని ప్రకటించాడు.ఫేస్ మాస్క్‌ ధరించి అనుక్షణం శానిటైజ్‌ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని అభ్యర్థించారు. కాగా సల్మాన్ ప్రస్తుతం బిగ్ బాస్ 14 షోను నిర్వహిస్తున్నాడు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకలు బిగ్‌బాస్ హౌజ్‌లోనే జరుపుకోనున్నారని సమాచారం.