తనదైన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. చిత్ర పరిశ్రమకు వచ్చి చాలారోజులైనా ఇప్పటివరకు ఆమె ఒక్క కమర్షియల్ యాడ్లో కూడా కనిపించడానికి ఇష్టపడటం లేదు. ఇలా పలు సందర్భాల్లో సాయి పల్లవి.. తను తోటి నటీనటులందరి కంటే చాలా విభిన్నం అని నిరూపించుకుంది. ఇక తాజాగా సాయి పల్లవి ఒక భారీ ఆఫర్ ని కూడా తిరస్కరించిందని సమాచారం.
తాజాగా ఒక ప్రముఖ ఫేస్ క్రీం సంస్థ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని సాయి పల్లవిని సంప్రదించగా, అందుకు సాయి పల్లవి ఒప్పుకోలేదట. ఆ ఫేస్ క్రీం సంస్థ సాయి పల్లవికి 2 కోట్లు పారితోషకంగా ఇస్తామని చెప్పినప్పటికీ కూడా సాయి పల్లవి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించింది. ‘సినిమాల్లో తాను మేకప్ వేసుకోకుండా నటిస్తున్నానని, అలాంటిది ఫేస్ క్రీమ్ వాడమని ప్రజలను తాను ఎలా ప్రోత్సహిస్తానని’ చెబుతూ ఆమె ఈ భారీ ఆఫర్ను తిరస్కరించిందని సమాచారం.