Sai Pallavi In Tejas Alivelumanga : హిట్స్.. ఫ్లాప్స్ తేడా లేకుండా తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తుంటాడు సెన్సేషనల్ డైరెక్టర్ తేజ. కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుంటాడు. ప్రస్తుతం తేజ యాక్షన్ హీరో గోపిచంద్‌తో అలిమేలుమంగ వేంకటరమణ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులు భారీగా అంచనాలు ఉండటం సహజమే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ అలిమేలు మంగ పాత్ర చాల కీలకమైనది, పైగా సినిమా కూడా ఈ పాత్ర మీదే నడుస్తోంది. అందుకే ఆ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేశారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారు. వారిలో మెయిన్ కాజల్, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళు సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో మిగిలిన హీరోయిన్స్ లిస్ట్ ను చూడగా.. హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మొదట అనుకున్నా కీర్తి వరుస సినిమాలతో బిజీగా వుంది. ఈ మధ్యలో సాయి పల్లవిను అనుకున్నారు, ఫైనల్ గా ఆమెనే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
10 ఏళ్ల మా ఎదురుచూపులు ఫలించాయి.. పాటల రచయిత శ్రీమణి లవ్ మ్యారేజ్