10 ఏళ్ల మా ఎదురుచూపులు ఫలించాయి.. పాటల రచయిత శ్రీమణి లవ్‌ మ్యారేజ్‌

ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. పెద్ద వారిని ఒప్పించి ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు

  • Manju Sandulo
  • Publish Date - 7:36 pm, Sun, 22 November 20

Shree Mani marriage: ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. పెద్ద వారిని ఒప్పించి ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. గత పదేళ్లుగా ఈ మూమెంట్‌ కోసం మేము ఎదురుచూశాము. మొత్తానికి మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌ అని కామెంట్‌ పెట్టారు. (ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. హీరోయిన్‌ రేసులో ఆ ఇద్దరు..!)

ఇక శ్రీమణి ట్వీట్‌కి స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్‌.. శ్రీమణి కంగ్రాట్స్‌. నీ రొమాంటిక్‌ లిరిక్స్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ ఇప్పుడు నాకు అర్థం అయ్యింది. ఇష్క్ షిఫాయా అని పాడి, రంగులద్దుకున్న అని సీక్రెట్‌గా లవ్‌ చేసి, ఏమోటో ఇది అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. మీ ఇద్దరికి హ్యాపీ మ్యూజికల్‌ మారిడ్‌ లైఫ్‌ అని కామెంట్‌ పెట్టారు. (ఏపీలో పలువురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం)