ఆ ఇద్దరు వద్దంటేనే విజయ్ వద్దకు వెళ్లిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లె లైట్ హీరోయిన్లుగా నటించారు.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లె లైట్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ మొదటి ఆప్షన్ కాదట.
ఈ సినిమా కథను మొదట మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కు వినిపించారట క్రాంతి మాధవ్. అయితే ఎందుకో తెలీదు గానీ మెగా మేనల్లుడు చేయలేనని చెప్పేశారట. ఇక ఆ తరువాత ఈ కథను శర్వానంద్ దగ్గరకు తీసుకెళ్లారట దర్శకుడు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండటం వలన శర్వా, ఈ మూవీని చేయలేనని చెప్పారట. ఈ క్రమంలో చివరకు వరల్డ్ ఫేమస్ కథ విజయ్‌కి చేరిందట.
అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో దేవరకొండ లిస్ట్‌లోని ఫ్లాప్ ఖాతాలో చేరింది. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్వకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో దేవరకొండ సరసన అనన్య భట్ జత కట్టింది. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తరువాత పూరీ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Read This Story Also: కరోనా అప్‌డేట్స్: 61 లక్షలు దాటేసిన కేసులు.. జర్మనీకి దగ్గరగా భారత్..!



