
Sai Dharam Tej: బైక్ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్న మెగా మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాతో బిజీగా మారాడు. ప్రస్తుతం తేజ్ 15వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు సుకుమార్ భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, కథ కూడా అందిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫొటోను విడుదల చేసింది. అడవిలో చెట్ల నడుమ సాయి ధరమ్‌తో పాటు కొందరు వ్యక్తులు చర్చిస్తున్నట్లున్న ఈ ఫొటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా చేతబడి నేపథ్యంలో ఉండనుందనేది సదరు వార్త సారంశం. చేతబడి పేరుతో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణిస్తున్న ఓ గ్రామంలోకి హీరో వస్తాడు.
అసలు గ్రామంలో మరణాలు ఎందుకు జరుగుతున్నాయి.? ఆ మిస్టరీల వెనక అసలు నిజం ఏంటన్న విషయాలను హీరో ఎలా ఛేదించాడన్న నేపథ్యంలో కథ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు ఉన్నాయి. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా ట్రైలర్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Team #SDT15 gives a peak into their Mystical world with this intriguing capture ??
From the lens of @shamdatdop ?@IamSaiDharamTej @karthikdandu86 @aryasukku @iamsamyuktha_ @BvsnP @bkrsatish @SukumarWritings @SVCCofficial pic.twitter.com/AXztNJDdEe— Maduri Mattaiah (@madurimadhu1) June 13, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..