‘సాహో’తో సై అంటున్న ‘మన్మధుడు’

|

Jul 15, 2019 | 7:45 PM

హైదరాబాద్: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంతా అక్కినేని, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమాకు ‘సాహో’ రూపంలో టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆగష్టు […]

సాహోతో సై అంటున్న మన్మధుడు
Follow us on

హైదరాబాద్: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సమంతా అక్కినేని, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమాకు ‘సాహో’ రూపంలో టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి.

ఇకపోతే ఆగష్టు 14 రాత్రి నుంచే సాహో థియేటర్లు బుక్ అయిపోతాయి. వేరే సినిమాలకు ఛాన్స్ ఉండదు. అప్పుడు నాగార్జున సినిమాకు గండి పడుతుందనే చెప్పాలి. అయితే ‘మన్మధుడు 2’ సినిమా కామెడీ ‘సాహో’ సినిమా యాక్షన్ కావడం వల్ల వసూళ్లు పరంగా ఇబ్బందేమీ ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు సాహో సినిమాను వరల్డ్‌వైల్డ్‌గా దాదాపు 8 వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అంటే ఆగష్టు 14 రాత్రి నుంచే మిగతా సినిమాలను పక్కన పెట్టేస్తారు. అది మన్మధుడికి కూడా తప్పదు. అయితే తన సినిమా మీదున్న నమ్మకంతో ప్రభాస్ సినిమా గురించి నాగ్ వర్రీ కావడం లేదు. సాహో స్టార్‌కి సై అంటూ సవాల్ విసిరాడు మన్మధుడు.