Kota Srinivasa Rao: ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నా.. వదంతులను కొట్టిపారేసిన కోట శ్రీనివాస రావు

Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు.

Kota Srinivasa Rao: ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నా.. వదంతులను కొట్టిపారేసిన కోట శ్రీనివాస రావు
Kota Srinivasa Rao

Updated on: Mar 21, 2023 | 10:57 AM

కోట శ్రీనివాస రావు.. సినీ అభిమానులకు పెద్దగా ప‌రిచ‌యం అక్కర్లేని పేరు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషాల్లోనూ తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నారు. విల‌న్‌గా భ‌య‌పెట్టడంలోనైనా.. కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలోనూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా క‌న్నీళ్లు పెట్టించ‌డంలోనైనా కోట శ్రీనివాస రావు స్టైలే వేరు. సినీ రంగంలో రాణించాల‌నుకునే అప్ క‌మింగ్ యాక్టర్లలో చాలా మంది కోట‌ శ్రీనివాస రావును స్పూర్తిగా తీసుకుంటారు. వ‌య‌స్సు మీద ప‌డుతున్నా ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూ.. యువ న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు మరణించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనే స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో బ్రహ్మాండంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని తన బాణీలో చమత్కరించారు. తప్పుడు వార్తలను నమ్మొద్దన్నారు. కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇవ్వడంతో అభిమానులంతా ఉపిరి పీల్చుకున్నారు.