ఆ ఇద్దరు హీరోల సినిమాలు అయితే నటిస్తా: రోజా

సినీ నటి, ఎమ్మెల్యే రోజా బిజీ బిజీ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా, అలాగే బుల్లితెరపైన కొన్ని షోల్లోనూ రోజా పనిచేస్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 am, Sun, 23 August 20
ఆ ఇద్దరు హీరోల సినిమాలు అయితే నటిస్తా: రోజా

Roja about movies: సినీ నటి, ఎమ్మెల్యే రోజా బిజీ బిజీ జీవితాన్ని గడిపేస్తున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా, అలాగే బుల్లితెరపైన కొన్ని షోల్లోనూ రోజా పనిచేస్తున్నారు. అయితే సమన్వయంతో తన పదవులను సమర్థవంతంగా చేసుకుంటూ వస్తోన్న రోజా.. వెండితెరకు దూరమై చాలా సంవత్సరాలే గడిచింది. చివరిసారిగా రోజా ఎన్ వాళి తాని వాళి(2015) అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఇక ఆమెను మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. అయితే అధిక సమయం రాజకీయాలకే కేటాయిస్తున్న రోజా.. ఇంతవరకు ఒక్క మూవీకి కూడా ఓకే చెప్పలేదు.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఛానెల్‌లో జరిగిన కార్యక్రమంలో.. మీరు మళ్లీ వెండితెరపై చిరంజీవితో కలిసి నటిస్తారా..! అని యాంకర్ శ్రీముఖి అడిగింది. అందుకు రోజా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని తెలిపారు. కాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కిస్తోన్న హ్యాట్రిక్ చిత్రంలో విలన్‌గా రోజాను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే బన్నీ నటిస్తోన్న పుష్పలోనూ రోజాను ఓ ప్రత్యేక పాత్ర కోసం తీసుకున్నట్లు గాసిప్‌లు వినిపించాయి. అయితే తాజాగా రోజా మాటలతో అవన్నీ పుకార్లేనని తెలుస్తోంది.

Read More:

RRR: సారీ చెప్పిన అలియా.. రేస్‌లో మరో నటి!

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !