AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నారు. కాగా రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది.

అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక
Anshu Malik
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2026 | 11:55 AM

Share

ప్రముఖ నటి ఆర్కే రోజా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు తమిళ్ ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలే. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రోజా ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచస్థాయిలో ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికే పలు పుస్తకాలు రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎంట్రప్రెన్యుయర్, ప్రోగ్రామర్‏గానూ రాణిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అన్షు మాలిక అమెరికాలో చదువుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో ఆమె తన కోరికల చిట్టా రాసుకొచ్చింది. తన విష్ లిస్ట్ లో ఒకొక్క కోరికను నెరవేర్చుకుంటున్నట్టు తెలిపింది అన్షు. హ్యారీ పోటర్ పుస్తకాలలోని బటర్ బీర్, స్టూడియో టూ ఇలా చాలానే రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

అలాగే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అన్షు మాలిక ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. హీరోయిన్స్ ను బీట్ చేసేలా ఉందని, సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అడుగుతున్నారు నెటిజన్స్. కాగా గతంలో రోజా ఓ ఇకంటర్వ్యూలో తన కూతురు శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ఉందని తెలిపారు. తల్లిదండ్రులుగా తాము డాక్టర్లు, ఇంజనీర్లు కాలేదని వారిని బలవంతం చేయమని, వారికి ఏది నచ్చితే అది సరైనదా కాదా చూసి ఆ మార్గంలో ప్రోత్సహిస్తామని గతంలో రోజా చెప్పుకొచ్చారు. అలాగే ఓ స్టార్ హీరో  ఇంటికి తన కూతురు కోడలిగా వెళ్తుందంటూ జరిగిన ప్రచారాన్ని కూడా రోజా ఖండించారు.

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

View this post on Instagram

A post shared by Anshu (@anshuselv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us