షకీలా రోల్ చాలెంజింగ్ రోల్.. సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ
మాలీవుడ్ శృంగార తార షకీలా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన 'షకీలా' సినిమా ఈ నెల 25న హిందీలో విడుదలైంది. ఈ సినిమాలో షకీల రోల్
మాలీవుడ్ శృంగార తార షకీలా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ‘షకీలా’ సినిమా ఈ నెల 25న హిందీలో విడుదలైంది. ఈ సినిమాలో షకీల రోల్ బాలీవుడ్ బ్యూటి రిచాచద్దా పోషించింది. 1990లో తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సీనియర్ నటి షకీల జీవితంలోని పలు కోణాలను ఈ సినిమాలో ఆవిష్కరించారు.
ఈ చిత్రంలో షకీలా క్యారెక్టర్ పోషించిన హీరోయిన్ రిచాచద్దా నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిచా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలను వెల్లడించింది. షకీలా రోల్ పోషించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపింది. ఆ పాత్రలో లీనం అవడంకోసం చాలా కష్టపడ్డానని చెప్పింది. మళయాలంలో షకీలాకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమాల లిస్ట్ తెప్పించుకొని అన్ని సినిమాలను చూసి అనుకరించానని తెలిపింది. షకీల వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం, స్టార్‌డమ్ గురించి తెలుసుకున్నానని వెల్లడించింది. దక్షిణాది సినిమాకు ప్రత్యేకతను అందించిన సినిమా షకీలా అని పేర్కొంది. తన జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికి షకీలా ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోవడం ఆమె మంచి గుణానికి నిదర్శనమని కొనియాడింది.