Adhipurush Movie Update: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ టాప్ హీరోయిన్ ?..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో  'రాధేశ్యామ్'

Adhipurush Movie Update: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ టాప్ హీరోయిన్ ?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 28, 2020 | 8:53 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రస్తుతం ఈ యంగ్ రెబల్ స్టార్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్‏లో పాల్గొననున్నాడు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్‏కు ప్రత్యర్థిగా రావుణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్‏గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటింబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అటు నిజంగానే కాజోల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా బాలీవుడ్ ఫీల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వార్తలపై ఆదిపురుష్ చిత్రబృందం కానీ.. ఇటు కాజోల్ కానీ స్పందించలేదు. మరి నిజంగానే కాజోల్ ఈ సినిమాలో నటిస్తుందా ? లేదా ? అనేది తెలియాలంటే ఇంకా కొన్ని ఆగాల్సిందే. తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన రఘువరన్ 2లో కాజోల్ నటించింది.