యదార్థ ఘటనల ఆధారంగా సినిమాలు తీసే డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల చిత్రికరించిన “మర్డర్” సినిమా విడుదలకు సిద్దంగా ఉందని తెలిపాడు. త్వరలో థియేటర్లకు వస్తుందని ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. అయితే తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్ మూవీని నిర్మించాడని ట్రైలర్, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని అమృత అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమాను తీసినట్లు ఆ మూవీ ట్రైలర్, పాటను చూస్తే అర్థమవుతుంది. దీంతో ప్రణయ్ తండ్రి ఆ సినిమా విడుదల ఆపివేయాలని నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కాగా విచరణ అనంతరం సినిమాను రీలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ మూవీ అప్డేట్ను రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్లో షేర్ చేసాడు. మర్డర్ సినిమాకు సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఆయన పోస్ట్ చేశాడు. అంతేకాకుండా “మర్దర్ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ఇక థియేటర్లలో చంపడానికి త్వరలోనే మర్డర్ రాబోతుందని” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ చంద్ర చిత్రికరించగా, శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
All Hurdles cleared for MURDER release ??? Coming to kill in theatres ??? pic.twitter.com/YhZjbkadkJ
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2020