గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న చిత్రం క్రాక్. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. ఈ టీజర్ రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓ తమిళ సినిమా ఫ్రీమేక్ అని తెలుస్తోంది.
మూడు సంవత్సరాల క్రితం కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సేతుపతి అనే చిత్రానికి క్రాక్ ఫ్రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సేతుపతి ఇప్పటికే ఒకసారి తెలుగులో రీమేక్ అయ్యింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హీరోగా పరిచయం అయిన జయదేవ్ సినిమా సేతుపతికి రీమేక్. ఇప్పుడు మరికొన్ని మార్పులతో గోపిచంద్ క్రాక్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా క్రాక్ మే8న ప్రేక్షకుల ముందుకు రానుంది.