Tiger Nageswara Rao: దేశంలోనే అతిపెద్ద దొంగ కథ.. మెస్మరైజ్ చేస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ట్రైలర్‌

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 70వ దశకంలో స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నార. ది కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 వంటి బ్లాక్‌ బస్టర్ హిట్‌ సినిమాలు అందించిన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అక్టోబర్‌ 20వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా....

Tiger Nageswara Rao: దేశంలోనే అతిపెద్ద దొంగ కథ.. మెస్మరైజ్ చేస్తున్న టైగర్‌ నాగేశ్వరరావు ట్రైలర్‌
Tiger Nageswara Rao Trailer

Updated on: Oct 03, 2023 | 5:22 PM

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరావు’. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను 70వ దశకంలో స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నార. ది కశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ 2 వంటి బ్లాక్‌ బస్టర్ హిట్‌ సినిమాలు అందించిన అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అక్టోబర్‌ 20వ తేదీన దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

2.30 నిమిషాల నిడివి ఉన్న సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ట్రైలర్ మొత్తానికి రవితేజానే సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైగర్‌ నాగేశ్వర్‌ రావు వ్యక్తిత్వం, డబ్బు, అమ్మాయిలపై ఆసక్తి ఉన్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసినట్లు సినిమాలో కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌ను గమనిస్తే నిర్మాణ విలువల్లో కాంప్రమైజ్‌ కాలేనట్లు అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్ స్కోర్‌ కూడా అద్భుతంగా ఉంది.

టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్..

ఇక రవితేజ ఈ ట్రైలర్‌లో మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు, ఒక రకంగా చెప్పాలంటే మాస్‌ మహారాజ తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టువర్ట్ పురం నాగేశ్వరావు టైరగ్ నాగేశ్వరావుగా ఎలా మారాడన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్ర కూడా ఉన్నట్లు చూపించడంతో కథపై మరింత ఆసక్తి పెరిగింది. మరి ఇన్ని అంచనాలు, ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..