Krack Movie : టాలీవుడ్ హీరోల్లో ‘మాస్ మహారాజ్’ అన్న, ఎనర్జిటిక్ హీరో అన్నా కూడా రవితేజనే అని అందరూ చెప్తుంటారు. పేరుకి తగ్గట్టే ఆన్‌స్క్రీన్ ఆయన యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఎనర్జిటిక్‌గా వేరే లెవల్లో ఉంటాయి. అసలు రవితేజకు ఈ ‘మాస్ మహారాజ్’ అనే పేరు ఎలా వచ్చింది. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రవితేజకు క్రాక్ రూపంలో సక్సెస్ వచ్చింది. సంక్రాంతికి ముందే జనవరి 9న విడుదలైన క్రాక్.. ఒంగోలులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. పవర్ ఫుల్ యాక్షన్ అంశాలతో క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంది. అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేసారు. ఆల్రెడీ సినిమా నిర్మాతను క్రాక్ సేఫ్ చేసేసిందట. అయితే ఈ సినిమా సగం సీటింగ్ లో కూడా బెస్ట్ గానే వసూల్ చేస్తుంది క్రాక్. విడుదలై 10 రోజులు దాటినా ‘క్రాక్’ కలెక్షన్స్ కోటికి తగ్గలేదని సమాచారం. 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ 94లక్షల షేర్స్ రాబట్టిందట. విడుదలకు ముందే అన్ని ప్రమోషన్లతో ప్రేక్షకులలో ఆసక్తి పెంచేసారు మేకర్స్. అటు ఆడియో పరంగా ఇటు థియేట్రికల్ ట్రైలర్ పరంగా క్రాక్ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :