‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక మందన్న.. స్పందించిన కన్నడ బ్యూటీ

| Edited By:

Nov 23, 2020 | 12:14 PM

2020 సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక మందన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక మందన్న.. స్పందించిన కన్నడ బ్యూటీ
Follow us on

Rshmika Mandanna news: 2020 సంవత్సరానికి గానూ నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా రష్మిక మందన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆదివారం రష్మిక సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయ్యారు. ఇక నేషనల్‌ క్రష్‌గా ఎన్నిక అవ్వడంపై రష్మిక కూడా సోషల్ మీడియాలో స్పందించారు. వాహ్‌.. నా ప్రజలు నిజంగా లెజండ్స్‌. వారు చాలా క్యూట్. కాదాంటరా..! వారందరికీ నా హృదయంలో చోటు ఉంది అని కామెంట్‌ పెట్టారు. (లెక్కల మాస్టార్‌కి కట్టలుతెంచుకున్న కోపం.. ‘పుష్ప’ టీమ్‌కి వార్నింగ్‌..!)

కాగా కన్నడ కిర్రిక్‌ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఛలోతో తెలుగు పరిశ్రమలోకి అడుగెట్టింది. ఇక్కడ వరుస విజయాలు పాటు ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే మహేష్‌ బాబు వంటి స్టార్‌ పక్కన మెరిసిన రష్మిక.. ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్‌తో జోడీ కట్టబోతోంది. ఇక మరోవైపు తమిళంలో కార్తి నటించిన సుల్తాన్‌లో రష్మిక నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. సూర్యతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. (నేను కలిసిన కొత్తలో గౌతమ్‌ ఎలా ఉండేవాడంటే.. భర్త గురించి మరిన్ని విషయాలు చెప్పిన కాజల్‌)