Actress Rashi Khanna: సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న రాశీ ఖన్నా.. ఆ ఒక్క ఫోటోతో అభిమానులను..
Actress Rashi Khanna: 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమన్న బొద్దుగుమ్మ రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షకుల ఊహల్లో నిలిచిపోయింది.
Actress Rashi Khanna: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమన్న బొద్దుగుమ్మ రాశీ ఖన్నా యువతను ఊహల్లో తేలియాడేలా చేసింది. ఆ తరువాత జోరు సినిమాలో నటించి తన జోరు ఏంటో చూపించింది అమ్మడు. కేరీర్ ఆరంభంలో తెలుగింటి ఆడపడుచులా సాంప్రదాయ వస్త్రధారణతో అలరించిన రాశీ ఖన్నా ఈ మధ్య స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టిన ఢిల్లీ బ్యూటీ.. అదే సమయంలో గ్లామర్ డోస్ పెంచేసింది. సినిమాల్లో తన గ్లామర్ ను ప్రదర్శించనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో తెగ రచ్చ చేసేస్తోంది ఈ అందాల ‘రాశీ’.
ఎప్పుడూ నిండు దుస్తులతో కనిపించే ఈ అమ్మడు.. కాస్త బక్కచిక్కి బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్ చేస్తున్న రాఖీ ఖన్నా.. స్మిమ్మింగ్ పూల్ వద్ద బికీలో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తన సోయగాలను ప్రదర్శిస్తూ ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలో రాశీ ఖన్నాను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకాలం మేం చూసిన రాఖీ ఖన్నా.. ఇప్పుడు చూస్తున్న రాశీ ఖన్నా వేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ కారణం రాశీ ఖన్నా పూర్తి స్లిమ్‌గా మారిపోవడమే. బొద్దు గుమ్మగా పేరు తెచ్చుకున్న ఢిల్లీ బ్యూటీ.. ఏడాదిపాటు చెమటోడ్చి స్లిమ్ బ్యూటీగా మారిపోయింది. బాలీవుడ్ ట్రైనర్ పర్యవేక్షణలో కఠినమైన వర్కవుట్లు చేసి నాజుకుగా మారిపోయింది.
అయితే, బికినీలో ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ అందాల రాశీ.. ఈ నాజూకు శరీరం సాధించడానికి పడిన శ్రమ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఫిట్‌నెస్ పరంగా తనకు ఇది ఇక అద్భుతమైన సంవత్సరం అని ట్వీట్‌లో పేర్కొంది. తాను పూర్తి శాకాహారిగా మారిపోయానని, ట్రైనర్ కుల్దీప్ సేతి అద్భుతమైన ఫలితాన్ని అందించాడంది. తాను ఎలా కనిపించాలనుకున్నానో.. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నానని, నా లక్ష్యాన్ని సాధించానని రాశీ తెగ సంబరపడిపోతోంది.
Rashi Khanna Tweet:
Sunshine, poolside, downtime.. In between schedules.. #lifeisgood ? pic.twitter.com/4Ye0nEcZ98
— Raashii Khanna (@RaashiKhanna) February 10, 2021
Also read:
డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి