Prabhas Radheshyam: రాధేశ్యామ్‌ నుంచి మరో అప్‌డేట్‌… హిందీలో బాణీలు అందిస్తోంది ఎవరంటే..

Prabhas Radheshyam New Update: ప్రభాస్‌ అభిమానులు... అంతెందుకు ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన..

Prabhas Radheshyam: రాధేశ్యామ్‌ నుంచి మరో అప్‌డేట్‌... హిందీలో బాణీలు అందిస్తోంది ఎవరంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 11, 2021 | 8:32 PM

Prabhas Radheshyam New Update: ప్రభాస్‌ అభిమానులు… అంతెందుకు ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు అమాతం పెరిగిపోయాయి. పెరిగిన ఈ అంచనాలకు తగినట్లుగానే చిత్ర యూనిట్‌ సినిమా మేకింగ్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడట్లేదు. భారీ బడ్జెట్‌తో సినిమాను అత్యంత రిచ్‌ లుక్‌తో తెరకెక్కిస్తున్నారు. 70వ కాలంలో రోమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత ప్రేమ కథగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్‌ సినీ లవర్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ తాజాగా హిందీ వెర్షన్‌కు సంబంధించి ఒక అప్‌డేట్‌ ఇచ్చింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హిందీ మినహా అన్ని భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక హిందీ వెర్షన్‌కి మిథున్‌, మన్నన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ కంపోజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. ఇక ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో చిత్ర యూనిట్‌ ఓ వినూత్న పోస్టర్‌ను విడుదల చేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ను పరిచయం చేస్తూ పోస్ట్‌ చేసిన పోస్టర్‌లో అఖండ భారత దేశం మ్యాప్‌తో పాటు మధ్యలో రైల్వే ట్రాక్‌ ఆకట్టుకుంటోంది. దీని బట్టి ఈ సినిమా రోమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న భారతదేశంతో ఏదో సంబంధం ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇక ప్రేమిలకు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 రాధేశ్యామ్‌ టీజర్‌ విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

Also Read: Anupama: అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా..? ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తోన్న ప్రేమమ్‌ బ్యూటీ ఇన్‌స్టా పోస్ట్..