గోవాకు ‘సర్కారువారిపాట’ టీం..? దుబాయ్‌లో షూటింగ్ ముగిసినట్లేనా!.. అసలు విషయం ఏంటంటే..

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

గోవాకు 'సర్కారువారిపాట' టీం..? దుబాయ్‌లో షూటింగ్ ముగిసినట్లేనా!.. అసలు విషయం ఏంటంటే..
uppula Raju

|

Feb 11, 2021 | 9:31 PM

మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్జాలోని బ్యూటీఫుల్ లొకేష‌న్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇప్పటికే ఫొటోలు వైర‌ల్ కూడా అయ్యాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశార‌ని టాక్‌. ఇంతలోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ప‌ర‌శురాం అండ్ టీం ఈ సినిమా కోసం గోవాలో స్పెష‌ల్ సెట్ ఒక‌టి వేయ‌నుంద‌ట‌. దుబాయ్ షెడ్యూల్ అయిపోగానే గోవాకు ప‌య‌నం కానుంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.

గోవాలో వేయ‌బోయే సెట్‌లో కొన్ని కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నట్టు వార్తలు వ‌స్తుండ‌గా దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కీర్తిసురేశ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్టర్. గీత‌గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ త‌ర్వాత ప‌ర‌శురాం చేస్తున్న చిత్రం కావ‌డంతో అభిమానుల్లో భారీగానే అంచ‌నాలున్నాయి. ఇక ట్విట్టర్‌లో ‘సర్కారు వారి పాట’ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మోత మోగిస్తున్నారు. #SarkaruVaariPaata అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ వరుస ట్వీట్స్ చేస్తుండటంతో ఈ సినిమా నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది. దీంతో ఏకంగా వంద మిలియన్లకు పైగా ఉపయోగించబడిన హ్యాష్ ట్యాగ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా గతంలో ఏ పరిశ్రమకు చెందిన సినిమా కూడా ఈ మైలురాయిని అందుకోకపోవడం, మొదటిసారి మహేష్ ఖాతాలోనే ఈ ప్రభంజనం చోటు చేసుకోవడం గమనార్హం.

‘అన్‌పెయిర్ అండ్ లవ్లీ’ షూటింగ్ కబుర్లు చెబుతున్న గోవా భామ.. లాక్‌డౌన్ వల్ల క్యారెక్టరే మరిచిపోయా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu