‘అన్‌పెయిర్ అండ్ లవ్లీ’ షూటింగ్ కబుర్లు చెబుతున్న గోవా భామ.. లాక్‌డౌన్ వల్ల క్యారెక్టరే మరిచిపోయా..

అందం గురించి ఆరోగ్యం గురించి ఇటీవల కొంతమందికి క్లాస్ పీకిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తతం తన కొత్త సినిమా షూటింగ్‌ బిజీలో ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన ఈ భామ అక్కడ అందివచ్చిన అవకాశాలన్నింటిని వినియోగించుకుంటుంది.

'అన్‌పెయిర్ అండ్ లవ్లీ' షూటింగ్ కబుర్లు చెబుతున్న గోవా భామ.. లాక్‌డౌన్ వల్ల క్యారెక్టరే మరిచిపోయా..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 3:40 PM

అందం గురించి ఆరోగ్యం గురించి ఇటీవల కొంతమందికి క్లాస్ పీకిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తతం తన కొత్త సినిమా షూటింగ్‌ బిజీలో ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన ఈ భామ అక్కడ అందివచ్చిన అవకాశాలన్నింటిని వినియోగించుకుంటుంది. టాలీవుడ్‌లో దాదాపుగా యంగ్ హీరోల అందరి సరసన నటించింది ఇలియానా. ఇటీవల కొంచెం బొద్దుగా మారిన ఈ భామ 80 డేస్ పేరుతో చాలా వర్కవుట్స్ చేసి తన మునుపటి రూపాన్ని సంతరించుకుంది.

అయితే ఇల్లి నటిస్తున్న సినిమాలన్ని లాక్‌డౌన్ వల్ల ఆగిపోయి ప్రస్తుతం ఒక్కొక్కొటిగా ప్రారంభమవుతున్నాయి. ‘పాగల్ పంతీ’ చిత్రం తర్వాత ఆమె చేస్తున్న ‘అన్‌పెయిర్ అండ్ లవ్లీ’ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. బల్వీందర్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్‌దీప్ హుడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ షూటింగ్‌లో పాల్గొనడంపై నటి ఇలియానా తన మనసులోని భావాలను వెల్లడించింది. ‘అన్‌పెయిర్ అండ్ లవ్లీ’ షూటింగ్‌లో భాగంగా ముంబై వచ్చానని కొవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకొని షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది. చిత్రీకరణకు ముందుగా అందరం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నామని, మొదటి రోజు కొంచెం భయపడ్డానని కానీ ఇప్పుడు అలవాటు అయిందని చెప్పింది. చాలాకాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొనేసరికి సినిమాలో నాక్యారెక్టర్‌ని మరిచిపోయాననే అనుమానం వచ్చిందని తెలిపింది. చిత్రీకరణకు ముందు కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుండని దర్శకుడు నేను అనుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ కెమెరా ముందుకు వెళ్లగానే నా పాత్రలోకి నేను పరకాయ ప్రవేశం చేశానని చెప్పింది. కొన్ని రోజులు గ్యాప్ రావడంతో ఇప్పుడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు