నిమ్మగడ్డ మరో బాంబు, మున్సిపల్ ఎన్నికలకూ త్వరలోనే ముహూర్తం, పంచాయతీల పోలింగ్ ముగిసేలోపే నోటిఫికేషన్.!
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా. అంటే..! అవి కూడా నిమ్మగడ్డ సారథ్యంలోనే జరుగుతాయా? అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ..
ఏపీలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా. అంటే..! అవి కూడా నిమ్మగడ్డ సారథ్యంలోనే జరుగుతాయా? అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు అధికారులతో చర్చించినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల పోలింగ్ రెండో దశకు, నామినేషన్ల పర్వం నాలుగో దశకు చేరుకుంటోంది. ఈనెల 21తో పంచాయతీ పోలింగ్ ముగుస్తుంది. ఈ లోపే మున్సిపల్ ఎన్నికలకూ షెడ్యూల్, నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల విషయంలో జగన్ సర్కారుకు, నిమ్మగడ్డకూ ఒక రకమైన యుద్ధమే జరిగితే, ఇక మున్సిపల్ ఎన్నికలు కూడా షురూ చేస్తే ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.
Read also : భారతీయ వేతన జీవులకు ఒక గుడ్ న్యూస్, ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట, అది ఏమేరకు..? అంటే..!