AP SEC: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎన్నికల కమిషన్ చర్యలు… మీడియాతో మాట్లాడొద్దంటూ ఆంక్షలు..
AP SEC Action On MLA Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకుంది. ఈ నెల 13 వరకు మీడియాతో మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించింది. ఎవరితోనూ సమావేశాలు...
AP SEC Action On MLA Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకుంది. ఈ నెల 13 వరకు మీడియాతో మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించింది. ఎవరితోనూ సమావేశాలు నిర్వహించొద్దనీ జోగి రమేష్‌ని ఎస్‌ఈసీ ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్ తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తాజాగా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్నారు. వార్డు మెంబర్‌గా పోటీచేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ చేసిన వ్యాఖ్యల తాళుకూ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.