యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను త్రివిక్రమ్ చేతుల మీదగా విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం యాక్షన్, లవ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తుండగా.. 90వ దశకం నాటి యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రశాంత్ పిళ్లై అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.