Virata parvam Movie: సమ్మర్‏లో రానున్న ‘విరాటపర్వం’.. ట్వీట్ చేసిన రానా దగ్గుపాటి..

బహుబాలి సినిమా తర్వాత హీరో రానా వరుస సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. అందులో ఒకటి విరాటపర్వం. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం

Virata parvam Movie: సమ్మర్‏లో రానున్న విరాటపర్వం.. ట్వీట్ చేసిన రానా దగ్గుపాటి..

Updated on: Jan 13, 2021 | 11:55 AM

బహుబాలి సినిమా తర్వాత హీరో రానా వరుస సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. అందులో ఒకటి విరాటపర్వం. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ గతేడాది పూర్తైంది. ఆ తర్వాత విడుదల చేయాలనుకున్నా కానీ కరోనా సంక్షోభంతో వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన అప్‏డేట్ వచ్చేసింది.

రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటిస్తోంది. “మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వం చిత్రంలో కూడా కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం” అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. ఇక ఇందులో హీరోయిన్‏గా సాయిపల్లివి నటిస్తుండగా.. నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‏లో విడుదల కాబోతుందని.. రానా తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో నక్సలైట్ గెటప్‏లో కనిపిస్తున్న రానా చేతిని పట్టుకొని సాయి పల్లవి నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: అయ్యప్పమ్‌ కోషియమ్ తెలుగు‌ రీమేక్ : పవన్ సరసన సాయి పల్లవి, రానా సరసన ఎవరో తెల్సా ?

ఇంటర్నేషనల్ రియాల్టీ షోకు హోస్ట్‌గా రానా.. పాల్గొననున్న టాప్‌ సెలబ్రిటీలు