ఇంటర్నేషనల్ రియాల్టీ షోకు హోస్ట్‌గా రానా.. పాల్గొననున్న టాప్‌ సెలబ్రిటీలు

దగ్గుబాటి రానా మరోసారి వ్యాఖ్యతగా మారనున్నారా..? ఓ ఇంటర్నేషనల్‌ రియాల్టీ షోకు హోస్టింగ్ చేయబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి

  • Tv9 Telugu
  • Publish Date - 3:44 pm, Fri, 20 November 20
ఇంటర్నేషనల్ రియాల్టీ షోకు హోస్ట్‌గా రానా.. పాల్గొననున్న టాప్‌ సెలబ్రిటీలు

Rana Daggubati host: దగ్గుబాటి రానా మరోసారి వ్యాఖ్యతగా మారనున్నారా..? ఓ ఇంటర్నేషనల్‌ రియాల్టీ షోకు హోస్టింగ్ చేయబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్‌ బాగా నడుస్తున్నందున అందులో రియాలిటీ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో రానా ఓ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్ కోసం రియాల్టీ షో చేశారట. ఇటీవలే ఈ షో షూటింగ్‌ కూడా పూర్తైనట్లు సమాచారం. (అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం.. టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పునియా)

ఇక ఈ షో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌లో ఉండనుందని, ఇందులో పలువురు టాప్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారని సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ షో ప్రమోషన్‌లు ప్రారంభం కానున్నాయని టాక్‌. మరి రానా చేసిన షో ఎలా ఉండబోతోంది..? అందులో ఎవరెవరు పాల్గొన్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మరోవైపు రానా నటించిన హాథీ మేరీ సాథీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం ఈ హీరో వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది తన బాబాయ్‌ వెంకటేష్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నారు రానా. (Bigg Boss 4: గ్రాండ్‌ ఫినాలే అప్పుడే.. ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న నిర్వాహకులు )