అయ్యప్పమ్‌ కోషియమ్ తెలుగు‌ రీమేక్ : పవన్ సరసన సాయి పల్లవి, రానా సరసన ఎవరో తెల్సా ?

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్ అయిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, పవర్‌ హౌస్‌ రానా దగ్గుబాటి కలిసి నటించబోతున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:07 pm, Mon, 23 November 20

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్ అయిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, పవర్‌ హౌస్‌ రానా దగ్గుబాటి కలిసి నటించబోతున్నారు. అవును మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పమ్‌ కోషియమ్‌ రీమేక్‌ కోసం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు డైరెక్టర్ సాగర్ కే చంద్ర. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కూడా మొదలైంది. ప్రజంట్ హీరోయిన్‌ సెలక్షన్‌పై ఫోకస్ పెట్టారు. ఇంత క్రేజీ మూవీలో హీరోయిన్స్‌ అంటే ఎంత క్రేజీగా ఉండాలి. ఆ క్రేజ్‌ కోసమే…. ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్‌ను సెట్ చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే పవన్‌కు జోడిగా సాయి పల్లవి ఫిక్స్‌ అన్నది ఇండస్ట్రీ టాక్. మరి రానా జోడి ఎవరు నటించబోతుంది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

పాత్ర విషయానికి వస్తే చిత్రంలో రానా పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది.మరి అంత సీరియస్‌ రోల్‌కు జోడి ఎలా ఉండాలి. ఈ విషయంలో సీరియస్‌గా థింక్ చేసిన యూనిట్‌.. ఫైనల్‌గా ఓ హాట్ బ్యూటీని పిక్ చేశారు. విలేజ్‌ లుక్‌లోనూ గ్లామర్‌ ఒలకబోసే గ్రేస్‌ ఉన్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. రెజీనా కసాండ్రా. యస్‌… అయ్యప్పమ్ కోషీయమ్‌ రీమేక్‌లో రానాతో జోడి కడుతున్న బ్యూటీ రెజీనానే అంటూ వార్తలొస్తున్నాయి. కొద్ది రోజులుగా తెలుగు స్క్రీన్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బిగ్ బ్యాంగ్‌తో బౌన్స్‌ బ్యాక్‌ అవుతున్నారు. మరి మన ఆడియన్స్ అమ్మడిని ఏ రేంజ్‌ వెల్‌ కం ఇస్తారో చూడాలి.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం