ఈ సొగసరి అందాలకు హద్దేలా..
TV9 Telugu
26 April 2024
మడోన్నా సెబాస్టియన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రేమమ్ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దగుమ్మ మడోన్నా సెబాస్టియన్.
తర్వాత తెలుగులో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో ఆడ్వకేట్ పాత్రలో కనిపించగా మెప్పించింది మడోన్నా.
సినిమాల్లోకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తున్నా ఈ అమ్మడు ఇప్పటివరకు నటించింది కేవలం 15 సినిమాలు కాగా తెలుగులో మూడు చిత్రాలు మాత్రమే చేసింది.
ఇటీవల తమిళంలో వచ్చిన లియో సినిమాలో విజయ్‌తో కలిసి ఎలిసా దాస్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. అవకాశాలు మాత్రం అంతగా తలుపు తట్టడం లేదు.
కానీ ఆ తర్వాత మాత్రం ఊహించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తుంది.
కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా సహాయ పాత్రలలోనూ కనిపించేందుకు రెడీగా ఉంటుంది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి చిత్రాలను ఎంచుకుంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి