Rana: రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జూన్17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించారు. జూన్5వ తేదీని ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఉదయం సురేశ్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటన చేసింది. అయితే ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటో చర్చకు దారి తీసింది. ఈ ఫొటోలో సాయి పల్లవి, రానాను హత్తుకున్నట్లు చూపించారు. అయితే రానా ఫేస్ కనిపించకుండా మేకర్స్ ఫొటోను డిజైన్ చేశారు.
దీంతో ఈ ఫొటోను ఓ నెటిజన్ రీట్వీట్ చేస్తూ.. ‘సొంత నిర్మాణ సంస్థలోనే ఫేస్ తీసేశారు. మిగతా వారు వేలెత్తి చూపడంలో తప్పేముంది. తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం, అందరికీ లోకువ అవడం రానా స్టైల్’ అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. దీంతో దీనిపై రానా తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయమై రానా.. ‘మనం తగ్గి.. కథ, నాయికను ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బ్యానర్ కదా గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు’ అని రానా రిప్లై ఇచ్చారు. రానా ఇచ్చిన ఈ రిప్లైకు అభిమానులు పెద్ద ఎత్తున మద్ధతు పలుకుతున్నారు. బాగా సమాధానం ఇచ్చారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Love is the biggest form of revolution!❤️?#VirataParvam Trailer on June 5th.#VirataParvamOnJune17th@RanaDaggubati @Sai_Pallavi92 @nanditadas @venuudugulafilm #SureshBobbili #DivakarMani @dancinemaniac @SureshProdns @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/UU3qcKqUOU
— Suresh Productions (@SureshProdns) June 3, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..