Rana Daggubati: యంగ్ హీరో రానా దగ్గుబాటి తాజాగా 11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా నటించిన `లీడర్` సినిమా 19 ఫిబ్రవరి 2010న విడుదలైంది. ఆ సినిమా ఈ రోజు (శనివారం)తో 11 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది. `లీడర్` సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి.. `హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అని పేర్కొంది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా రానాకు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.
Wishing @RanaDaggubati the best on finishing 11 years as an actor! Here is a very special video reminiscing his journey so far! ♥️https://t.co/72yL9ekGqV
— Suresh Productions (@SureshProdns) February 19, 2021
Rana completes 11 years as an actor! Here’s to all his unforgettable characters, super hit movies, undeniable energy and passion for what he does ♥️@RanaDaggubati #11GloriousYrsOfRANADAGGUBATI pic.twitter.com/WQIEkWb4uX
— Suresh Productions (@SureshProdns) February 18, 2021