Ramanaidu Studios:మూతపడనున్న రామానాయుడు స్టూడియో.. అసలు కారణమిదేనా..?

| Edited By:

Feb 19, 2020 | 2:44 PM

టాలీవుడ్‌కు సంబంధించి ప్రముఖ స్టూడియోలలో హైదరాబాద్‌లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ ఒకటి. దిగ్గజ నిర్మాత, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

Ramanaidu Studios:మూతపడనున్న రామానాయుడు స్టూడియో.. అసలు కారణమిదేనా..?
Follow us on

Ramanaidu Studios: టాలీవుడ్‌కు సంబంధించి ప్రముఖ స్టూడియోలలో హైదరాబాద్‌లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ ఒకటి. దిగ్గజ నిర్మాత, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత దగ్గుబాటి రామానాయుడు ఈ స్టూడియోను నిర్మించారు. దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్టూడియోలో ఎన్నో సినిమాలు చిత్రీకరణను జరుపుకున్నాయి. అయితే ఈ స్టూడియో ఇప్పుడు మూతబడుతోందన్న వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఈ స్టూడియోస్‌ను మూసేయాలని యజమాని, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు భావిస్తున్నారట. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ స్టూడియోను మూసివేయడంపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అవేంటంటే.. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తమ స్టూడియోను మరింత విస్తరించాలని సురేష్ బాబు భావిస్తున్నారట. ఇక హైదరాబాద్‌లో ఉన్న స్టూడియో రూ.200కోట్లు విలువ చేయనుండగా.. దాని ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉందట. స్టూడియో చుట్టూ బోలెడన్ని అపార్ట్‌మెంట్లు రావడం.. అక్కడ షూటింగ్ జరుగుతుంటే చుట్టూ ఉన్న వారు ఫోన్లలో రికార్డు చేయడంతో.. అక్కడ షూటింగ్ చేసేందుకు మేకర్లు పెద్దగా ఆసక్తిని చూపడం లేదట. దీంతో రెవెన్యూ కూడా పడిపోయిందట. ఇక వర్షాకాలం సమయంలో ఆ స్టూడియోకు వెళ్లేందుకు కూడా కష్టమవుతోందట. ఇలా పలు కారణాల వలన రామానాయుడు స్టూడియోను మూసివేయాలని సురేష్ భావిస్తున్నారట. దీని బదులు విశాఖపట్టణంలోని స్టూడియోను అభివృద్ధి చేయడమే మంచిదని అనుకుంటున్నారట. ఇక ఈ నిర్ణయంపై సురేష్ సోదరుడు వెంకటేష్, కుమారుడు రానా కూడా ఓకే చెప్పినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also:కపిల్, రోమీలుగా ‘దీప్‌వీర్’.. అదరగొట్టేస్తోన్న ఫస్ట్‌లుక్..!