Red movie : సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్న’రెడ్’.. మొద‌టి రోజు కలెక్షన్లు ఎంతంటే..

|

Jan 15, 2021 | 4:27 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన 'రెడ్ మూవీ' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్..

Red movie : సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్నరెడ్.. మొద‌టి రోజు కలెక్షన్లు ఎంతంటే..
Follow us on

Red movie : ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్ మూవీ’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 14 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ ‘రెడ్’ మూవీతో మరోసారి ఆకట్టుకున్నాడు. మొదటిసారి రామ్ ఈ సినిమాతో డ్యూయల్ రోల్ లో కనిపించడు. ‘తడమ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొద‌టి రోజు రెడ్  మూవీ సుమారు రూ. 6.70 కోట్లు షేర్ రాబ‌ట్టింది. నైజాంలో రూ.2.19 కోట్లు, సీడెడ్ లో రూ.1.17 కోట్లు,  గుంటూరు రూ.46.5 ల‌క్ష‌లు, నెల్లూరు రూ.36 ల‌క్ష‌లు, ప‌శ్చిమ‌గోదావ‌రి రూ.95.7 ల‌క్ష‌లు, తూర్పు గోదావ‌రి రూ. 63.85 ల‌క్ష‌లు, కృష్ణా రూ.35.3 ల‌క్ష‌లు, అలాగే ఉత్త‌రాంధ్ర రూ.53 ల‌క్ష‌లు వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఈ సందర్భంగా హీరో రామ్ స్పందిస్తూ.. రెడ్ చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్ గా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఫేస్ మాస్కు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేయండి.. అంటూ ట్వీట్ చేశాడు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Samuthirakani : పవర్ స్టార్ సినిమాలో బన్నీ విలన్.. క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సముద్రఖని

Pawan Kalyan: 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. పాల్గొననున్న పవన్‌ కల్యాణ్