Ram Gopal Varma: రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Dec 26, 2021 | 9:02 AM

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ' ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్‌ హీరోలుగా నటిస్తున్నారు.

Ram Gopal Varma:  రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ..  ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, తారక్‌ హీరోలుగా నటిస్తున్నారు.  అలియాభట్‌, ఓలీవియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ జక్కన్న సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా శాంతించిందనుకున్న కరోనా మళ్లీ ఒమిక్రాన్‌ రూపంలో కోరలు చాస్తోంది. దీంతో పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు ఆర్జీవి. అందులో ‘ ఒమిక్రాన్ గురించి ప్రభుత్వాలకు కావాల్సిన గొప్ప ఐడియా నా వ‌ద్ద ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుద‌ల సమయంలో డ‌బుల్ డోస్ టీకా తీసుకున్న వారిని మాత్రమే థియేట‌ర్లలోకి అనుమ‌తి ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల‌న్న ఉద్దేశంతోనైనా చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారు’. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తోనైనా ఫ్యాన్స్‌ టీకా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌గోపాల్‌ వర్మ ఐడియా బాగుందని చాలామంది నెటిజన్లు కామెంట్‌ చేస్తుంటే.. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నామని మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టకండి అని స్పందిస్తున్నారు.