RGV: చాలా రోజుల తర్వాత వర్మ ఎమోషనల్ స్టేట్‌మెంట్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తారట..

|

Jan 16, 2021 | 5:02 PM

'నాకు ఇంట్రస్ట్‌లు అంటూ ఏం ఉండవు.. నిద్రలేవగానే ఏది అనిపిస్తే అదే సినిమాగా తీసేస్తా.....' అంటూ తన స్టోరి సెలక్షన్‌ గురించి చాలా సార్లు చెప్పారు రామ్‌గోపాల్ వర్మ. అయితే ఇంత బోల్డ్‌గా మాట్లాడే....

RGV: చాలా రోజుల తర్వాత వర్మ ఎమోషనల్ స్టేట్‌మెంట్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తారట..
Follow us on

RGV:  ‘నాకు ఇంట్రస్ట్‌లు అంటూ ఏం ఉండవు.. నిద్రలేవగానే ఏది అనిపిస్తే అదే సినిమాగా తీసేస్తా’….. అంటూ తన స్టోరి సెలక్షన్‌ గురించి చాలా సార్లు చెప్పారు రామ్‌గోపాల్ వర్మ. అయితే ఇంత బోల్డ్‌గా మాట్లాడే వర్మ ఇప్పుడు ఓ ఎమోషనల్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు. త్వరలో నా డ్రీమ్‌ ప్రాజెక్ట్ ని ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నా అంటూ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఎంత ఎమోషనల్‌గా చెప్పినా, తన స్టైల్‌ సినిమానే చూపించేందుకు రెడీ అవుతున్నారు. అదే మరోసారి గ్యాంగ్‌ స్టర్ డ్రామానే వర్మ పిక్ చేసుకున్నారు. అయితే రెగ్యులర్‌ స్టైల్‌లో పులిహోర కలిపేయకుండా ఈ సారి కాస్త సీరియస్‌గా సినిమా చేసేట్టున్నారన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. గత 4, 5 ఇయర్స్ లో వర్మ చేసిన సినిమాల విషయంలో క్వాలిటీ పరంగా చాలా కంప్లయింట్స్ వినిపించాయి.

డీ కంపెనీ జస్ట్ దావూద్ బయోపిక్ మాత్రమే కాదట. డీ కంపెనీ అనే బ్రాండ్‌లో ఎదిగిన చాలా మంది గ్యాంగ్ స్టర్స్ గురించి ఈ సినిమాలో చూపిస్తా అంటున్నారు వర్మ. అంటే డీ కంపెనీ ఒక్క సినిమాగానే వస్తుందా లేక ఓ సిరీస్‌లా చేస్తారా..? ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జనవరి 23న ట్రైలర్‌ రిలీజ్ అని చెప్పిన వర్మ.. అప్పుడే సినిమా విషయంలో మరింత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read :

గాయపడ్డ తండ్రిని పరామర్శించేందుకు సొంతూరుకు జావాను.. రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఆర్మీ దినోత్సవం రోజే

Covaxin and Covishield: కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. శక్తిసామర్థ్యాలపై ఓ లుక్కేద్దాం పదండి.. ఎంతకాలం సేఫ్..?

Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..