ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి

| Edited By:

Sep 16, 2020 | 11:37 AM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పలువురు బయోపిక్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేశారు

ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి
Follow us on

Ram Gopal Varma Biopic: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పలువురు బయోపిక్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో తన బయోపిక్ తెరకెక్కుతుందంటూ ఆ మధ్యన ప్రకటించారు. ఇక ఈ బయోపిక్‌కి సంబంధించిన మొదటి అడుగు తాజాగా పడింది. రామ్ గోపాల్ వర్మ బయోపిక్‌కి సంబంధించి తొలి భాగం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ కాలేజీలో వర్మ బయోపిక్ స్టార్ట్‌ అయ్యింది.

ఈ సందర్భంగా వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే ఆయన సోదరి విజయ క్లాప్ కొట్టారు. మూడు భాగాల్లో వర్మ బయోపిక్‌ రానుంది. ఈ మూడు భాగాలను బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఇక మొదటి భాగానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ భాగంలో వర్మ పాత్రలోనూ తేజ నటిస్తున్నారు. ఈ పార్ట్‌లో వర్మ కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్‌ మొదలైనవి చూపించనున్నారు. అలాగే శివ చేయడానికి గల కారణాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.