‘ఇస్మార్ట్ శంకర్’పై రామ్ చరణ్ ప్రశంసలు

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గతవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ మూవీని మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు. ‘‘రామ్, ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. పూరీ గారికి […]

‘ఇస్మార్ట్ శంకర్’పై రామ్ చరణ్ ప్రశంసలు
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Jul 26, 2019 | 11:36 AM

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గతవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు ఈ మూవీని మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు.

‘‘రామ్, ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. పూరీ గారికి కంగ్రాట్స్’’ అని కామెంట్ పెట్టాడు చెర్రీ. దానికి పూరీ స్పందిస్తూ ‘‘రామ్ చరణ్ లవ్ యూ’’ అని తెలిపాడు. మరోవైపు రామ్ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యు సో మచ్ బ్రదర్’’ అని కామెంట్ పెట్టాడు.

https://www.facebook.com/AlwaysRamCharan/posts/1349024551912594

అయితే హీరోగా రామ్ చరణ్ మొదటి మూవీ ‘చిరుత‘ను పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినప్పటికీ.. రామ్ చరణ్‌కు గ్రాండ్ ఎంట్రీని తీసుకొచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu