సునీల్‌కు కృతఙ్ఞతే లేదు: హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్

‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఆకాష్ అలియాస్ జై ఆకాష్ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటించి ఫేడ్‌అవుట్ అయ్యారు. ప్రస్తుతం అతడు కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా  పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తన మూవీ కాపీ అంటూ ఆరోపణలు చేయడంతో మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కమ్ హీరో సునీల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆకాష్. ఆకాష్ హీరోగా నటించిన ‘పిలుస్తే పలుకుతావా’ […]

సునీల్‌కు కృతఙ్ఞతే లేదు: హీరో ఆకాష్ షాకింగ్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 6:48 AM

‘ఆనందం’ సినిమాతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఆకాష్ అలియాస్ జై ఆకాష్ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో నటించి ఫేడ్‌అవుట్ అయ్యారు. ప్రస్తుతం అతడు కోలీవుడ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా  పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తన మూవీ కాపీ అంటూ ఆరోపణలు చేయడంతో మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కమ్ హీరో సునీల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆకాష్.

ఆకాష్ హీరోగా నటించిన ‘పిలుస్తే పలుకుతావా’ సినిమాలో సునీల్ కమెడియన్‌గా చేశాడు. ఆ పరిచయంతోనే సునీల్ హీరోగా చేసిన అందాల రాముడులో ఓ పాత్ర ఉందంటూ ఆకాష్‌కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారట. కానీ ఆ పాత్ర తనకు నచ్చలేదని చెప్తే.. దాన్ని డెవలప్ చేస్తానని మాటిచ్చారని అన్నాడు. అంతేకాకుండా ప్రతిరోజు షూటింగ్ టైంలో ఇవి చేతులు కాదు కాళ్లు అనుకో అంటూ బతిమలాడేవాడని తెలిపాడు. కానీ తీరా సినిమా చూస్తే పోస్టర్లో అసలు తన బొమ్మన లేదని వాపోయారు. ఒరిజనల్ వర్షన్‌లో ఒక పాట కూడా ఉండేదని అది కూడా తీసేశారని అన్నారు. అలాగే ప్రమోషన్లో, ఈవెంట్‌లో తన పేరు ఒక్కసారి కూడా చెప్పలేదని.. అసలు సునీల్‌కు కృతఙ్ఞత లేదంటూ చెప్పుకొచ్చారు ఆకాష్. అంతేకాకుండా ‘నవవసంతం’ సినిమా సమయంలో కూడా సునీల్ తనను చిన్న చూపు చూసేవాడని.. భయ్యా.. భయ్యా అని పిలిచేవాడని.. సడన్‌గా ‘ఏ ఆకాష్’ అని పిలవడం మొదలుపెట్టాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆకాష్.