బ్రేకింగ్: ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి పోలీసులు
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి తాజాగా పోలీసులు వెళ్లారు. ఓ కేసు విషయంలో నటిని ప్రశ్నించేందుకు వారు హౌస్‌లోకి వెళ్లారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇదంతా ఇక్కడ కాదు.. తమిళ్ బిగ్‌బాస్ షోలో. తమిళ్ ‘బిగ్‌బాస్ 3’లో పాల్గొన్న వారిలో నటి మీరా మిథున్ ఒకరు. ఈమెపై గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అందాల పోటీలకు డిజైనర్‌గా అవకాశం ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి నుంచి నటి […]
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘బిగ్‌బాస్ 3’ హౌస్‌లోకి తాజాగా పోలీసులు వెళ్లారు. ఓ కేసు విషయంలో నటిని ప్రశ్నించేందుకు వారు హౌస్‌లోకి వెళ్లారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహకుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇదంతా ఇక్కడ కాదు.. తమిళ్ బిగ్‌బాస్ షోలో.
తమిళ్ ‘బిగ్‌బాస్ 3’లో పాల్గొన్న వారిలో నటి మీరా మిథున్ ఒకరు. ఈమెపై గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అందాల పోటీలకు డిజైనర్‌గా అవకాశం ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి నుంచి నటి మీరా మిథున్ రూ.50వేలు తీసుకుంది. అయితే ఆ తరువాత పని ఇప్పించకపోవడం, తీసుకున్న డబ్బు ఇవ్వలేదంటూ ఆ వ్యక్తి ఇటీవల పోలీస్‌లకు ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు చెన్నై హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకుంది మీరా. ఇక ఈ కేసులో హైకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడంతో మీరాతో పాటు బిగ్‌బాస్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం అనూహ్యంగా పోలీసులు మీరాను విచారించేందుకు హౌస్‌లోకి ప్రవేశించారు. దీంతో ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
అయితే ఈ సీజన్‌లో తమిళనాట బిగ్‌బాస్ హౌస్‌లోకి పోలీసులు ప్రవేశించడం ఇది తొలిసారేం కాదు. ఇటీవల కూతురు కిడ్నాప్ కేసులో నటి వనితా విజయ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు హౌస్‌లోకి వెళ్లారు. ఆ సమయంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ కూతురు ఇచ్చిన వాంగూల్మంతో వనితా అరెస్ట్ నుంచి తప్పించుకుంది. ఆ తరువాత ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.