AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్ము రేపిండు.. రజనీకాంత్ న్యూ లుక్..

రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకే కాదు.. సౌత్‌లోని సిని ప్రియులందరికీ పండుగే. అందులోనూ మురుగదాస్ లాంటి డైరెక్టర్, నయనతారా లాంటి హీరోయిన్ కాంబినేషన్ అంటే అంచనాలు మరింత భారీగా ఉంటాయి. పైగా పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడంటే ఇక మామూలుగా ఉంటుందా..! అందుకే దర్భార్ మూవీ పై చెప్పలేనంత ఆసక్తి నెలకొంది. దానికి తోడు వరుసగా లీకవుతున్న షూటింగ్ స్పాట్ ఫోటోలు చూసి మరిన్ని అంచనాలు వేసేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈచిత్రానికి అనిరుద్ రవిచందర్ […]

దుమ్ము రేపిండు.. రజనీకాంత్ న్యూ లుక్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 26, 2019 | 11:48 AM

Share

రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకే కాదు.. సౌత్‌లోని సిని ప్రియులందరికీ పండుగే. అందులోనూ మురుగదాస్ లాంటి డైరెక్టర్, నయనతారా లాంటి హీరోయిన్ కాంబినేషన్ అంటే అంచనాలు మరింత భారీగా ఉంటాయి. పైగా పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడంటే ఇక మామూలుగా ఉంటుందా..! అందుకే దర్భార్ మూవీ పై చెప్పలేనంత ఆసక్తి నెలకొంది. దానికి తోడు వరుసగా లీకవుతున్న షూటింగ్ స్పాట్ ఫోటోలు చూసి మరిన్ని అంచనాలు వేసేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈచిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న‌ విడుదల కానుంది. బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

తాజాగా చిత్రంలో ర‌జ‌నీకాంత్ లుక్స్‌కి సంబంధించి రెండు పోస్టర్స్‌ని మురుగదాస్ విడుదల చేశారు. ఇందులో ర‌జ‌నీకాంత్ లుక్స్ ప్రేక్ష‌కుల‌కి ప‌ట్ట‌లేని ఆనందాన్ని అందిస్తున్నాయి. ఖాకీ డ్రస్సు పై లాంగ్ కోటు వేసుకుని.. చేతిలో ఆయుధంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు రజనీకాంత్. ఇక అతి త్వరలోనే మూవీ టీజ‌ర్ రిలీజ్‌కి మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. చిత్రంలో యువ‌రాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ , విజ‌య్ సేతుప‌తి ధ‌ర్మ‌దొరైలో న‌టించిన జీవా అనే ట్రాన్స్‌జెండ‌ర్ ద‌ర్భార్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నార‌ట‌. ఈ దెబ్బతో దర్భార్‌కి మరింత హైప్ క్రియేట్ అయిపోవడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే