ఫస్ట్‌ పోస్ట్ చేసిన చెర్రీ.. వావ్.. ఎంత క్యూటో..!

| Edited By: Srinu

Jul 12, 2019 | 1:22 PM

ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగెట్టిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇవాళ మొదటి పోస్ట్ చేశారు. తన అమ్మతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు తీసుకున్న ఫొటోను రెండింటిని పోస్ట్ చేసిన చెర్రీ.. ‘‘కొన్ని ఎప్పటికీ మారవు. నా మొదటి ఫొటోను నీకే అంకితం చేస్తున్నా. లవ్ యు అమ్మ. మమ్మాస్ బాయ్ ఫరెవర్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫొటోలో చెర్రీ చాలా క్యూట్‌గా ఉన్నాడు. See more కాగా సోషల్ మీడియాలో మొన్నటివరకు రామ్ చరణ్‌కు […]

ఫస్ట్‌ పోస్ట్ చేసిన చెర్రీ.. వావ్.. ఎంత క్యూటో..!
Follow us on

ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగెట్టిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇవాళ మొదటి పోస్ట్ చేశారు. తన అమ్మతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటోను.. ఇప్పుడు తీసుకున్న ఫొటోను రెండింటిని పోస్ట్ చేసిన చెర్రీ.. ‘‘కొన్ని ఎప్పటికీ మారవు. నా మొదటి ఫొటోను నీకే అంకితం చేస్తున్నా. లవ్ యు అమ్మ. మమ్మాస్ బాయ్ ఫరెవర్’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫొటోలో చెర్రీ చాలా క్యూట్‌గా ఉన్నాడు.

కాగా సోషల్ మీడియాలో మొన్నటివరకు రామ్ చరణ్‌కు ఫేస్‌బుక్ మాత్రమే ఉండేది. అయితే అభిమానులకు మరింత దగ్గరగా ఉండాలనుకుంటున్న చెర్రీ.. తాజాగా ఇన్‌స్టాను ఓపెన్ చేశాడు. దీంతో అల్లు అర్జున్, సమంత, అఖిల్, తమన్నా తదితరులు ఇన్‌స్టాలోకి చెర్రీకి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయనకు 4,31,000వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇంకా ఎవరినీ ఫాలో అవ్వడం లేదు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్రీ, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్‌తో కలిసి మొదటిసారిగా స్క్రీన్ చేసుకోబోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ మూవీతో పాటు చిరంజీవి నటిస్తున్న సైరాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.